28 March, 2026 | 10:51 PM

కాంగ్రెస్ గరీబోళ్ల పార్టీ

05-05-2024 01:26 AM

ఆశీర్వదించి మరోసారి ఎంపీగా గెలిపించండి

జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్

జహీరాబాద్, మే 4: కాంగ్రెస్ గరీబోళ్ల పార్టీ అని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం చాల్కి, చీకుర్తి గ్రామాల్లో ప్రచారం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మాటాలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పార్లమెంట్ ఎన్నికలయ్యాక మిగిలినవి అమలు చేస్తుందని చెప్పారు.

పేదలకు సేవ చేసేందుకు తనను మరోసారి ఆశీర్వాదించి ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పలువురు కాంగ్రెస్‌లో చేరగా, వారికి కండువాలుకప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్‌హైమద్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సిద్ధిలింగయ్యస్వామి, ఎంపీపీ వైస్ చైర్మన్ గౌసుద్దీన్, మాజీ జెడ్పీటీసీ చంద్రప్ప, నాయకులు జనార్దన్‌రెడ్డి, రాజప్పపాటేల్, రాజేశ్, రఫీయోద్దీన్, అనీల్‌రెడ్డి, రామకృష్ణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, రవికుమార్, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.