సర్దార్ జమలాపురం కేశవరావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి
ఎర్రుపాలెం, మార్చి 29 (విజయక్రాంతి): స్థానిక ఎస్ జె కె ఎం జూనియర్ కళాశాలలో సర్దార్ జమలాపురం కేశవరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆదివారం కేశవరావు వర్ధంతి సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల డైరెక్టర్ దండం సత్యనారాయణ రెడ్డి ముందుగా కేశవరావు ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తదనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సర్దార్ జమలాపురం కేశవరావు ఆశయాలను అనుగుణంగా ఆయన పేరుతో ఎర్రుపాలెంలో నిర్మించిన కళాశాలకు కేశవరావు పేరు పెట్టినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. తమ కళాశాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, కేశవరావు పేరుమీద వారికి విద్యను అందిస్తున్నామని ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని, కేశవరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామ న్నారు. ప్రిన్సిపాల్ నాగిరెడ్డి సౌజన్య, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.




