21 August, 2026 | 10:08 PM

Breaking News

కొత్తగూడెంల జీజీహెచ్ త్వరలో క్యాథ్ ల్యాబ్ సేవలు: ఎమ్మెల్యే కూనంనేని   •   కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయం   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •  

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

22-04-2026 12:00 AM

డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్

మరిపెడ (మహబూబాబాద్) ఏప్రిల్ 21 (విజయక్రాంతి): నిలువ నీడలేని పేదలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిజం చేసిందని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. మరిపెడ మండలంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడంతోపాటు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులైన నేతావత్ కవిత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోకుండా నిజం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండయ్య, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ నరేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ నరసయ్య, బానోతు కిషోర్, ఉప సర్పంచ్ రాము నాయక్ పాల్గొన్నారు.