8 April, 2026 | 2:21 AM

పులుసు బొంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, రైతాంగానికి నీరందించాలి

08-04-2026 12:00 AM

సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు 

మణుగూరు, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల లో రైతాంగానికి ఉపయోగపడే పులుసు బొంత ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం  తక్ష ణం నిర్మించి సీతారామ ప్రాజెక్టుకి అను సంధానించాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక శ్రామిక భవన్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

లింకు కెనాల్ బ్రాంచ్ కెనాల్, కొరకు భూ సేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పులుసు బంత ప్రాజెక్టు నిర్మిస్తే సుమారు 20 వేలు ఎకరాలు సాగులోకి రావడానికి అవకాశం ఉంటుందని సీతారామ ప్రాజెక్టు నుండి గతంలో సర్వే చేసిన దాని ప్రకారం పులుసు బొంత కు అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జె ట్ లో రైతాంగానికి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.

ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయ డం రైతులకు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహి స్తుందని దీనితో  రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే జిల్లాలో విస్తారంగా సాగవు తున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామా యిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని, అప్పారావు పేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని, ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబా టులో ఉంచాలని పేర్కొన్నారు. కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 23, 24, 25 తేదీలలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహా సభలను జయప్రదం చెయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకు లు నెల్లూరి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కమిటీ సత్రపల్లి సాంబశివరావు, కేవీపీఎస్ నాయకులు కొడిశాల రాములు, పిట్టల నాగమణి, లెనిన్ బాబు, రాజు, సంకినేని వెంకట రావు , నరసింహారావు,  నాగేశ్వరరావు, మల్లేష్  రైతు నాయకులు  పాల్గొన్నారు.