8 August, 2026 | 2:33 AM

దేశంలో ఇప్పటికీ సగం ప్రజాస్వామ్యమే

08-08-2026 12:31 AM
  1. విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా ఎదగాలి
  2. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు

హైదరాబాద్, ఆగస్టు 7(విజయక్రాంతి): దేశంలో ఓటు హక్కు అందరికీ ఉన్నప్పటికీ, రాజకీయ ప్రాతినిధ్యం అందరికీ లేదని,  సగం ప్రజాస్వామ్యమే అమలులో ఉం దని మాజీ డీజీపీ, సామాజిక న్యాయవాది డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అ న్నారు. శుక్రవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సి టీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐవోబీసీఎస్‌ఏ) ఆధ్వర్యం లో నిర్వహించిన మండల్ దినోత్స వానికి ముఖ్య అతిథిగా మాజరై ప్రసంగించారు. చట్టసభల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంలో దేశం విఫలమైందన్నారు. ఓటు ప్రజాస్వా మ్యం వచ్చింది.. కానీ అధికార ప్రజాస్వా మ్యం ఇంకా రాలేదన్నారు.

వెనుకబడినవ ర్గాల సామాజిక, విద్యా వెనుకబాటునుఅధ్యయనం చేసి, 52శాతం జనాభాకు 27 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేసిన మండల్ కమిషన్ భారత రాజకీయాలను శాశ్వతంగా మార్చిందన్నారు. ఉద్యోగాల్లో, విద్యలో రిజర్వేషన్ అవసరం.. వీటిపై నిర్ణయాలు తీసు కునేది శాసనసభలు. అక్కడే మనం లేకపోతే విధానాలు ఇతరుల చేతుల్లో నే ఉంటాయి. విద్యార్థులు  రాజకీయ నాయకత్వాన్ని లక్ష్యం గా పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో సూ రజ్ మండల్, తెలంగాణ విఠల్,ఎంఎల్సీ అనిల్‌కుమార్, సూర్యారావు పాల్గొన్నారు.