28 July, 2026 | 1:45 AM

భూ వివాదాలకు కోర్టే శాశ్వత పరిష్కారం

28-07-2026 01:01 AM

ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి మండలం, జూలై 27: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోర్టు ద్వారానే సాధ్యమని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 25 ఫిర్యాదులు స్వీకరించిన ఆమె, భూ వివాదాల పేరుతో బెదిరింపులు, దౌర్జన్యాలు, మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజావాణిలో 18 భూ వివాదాలు, ఒక భార్యాభర్తల వివాదం, ఆరు పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.