పీఎం ఫసల్ బీమాను అమలు చేయాలి
28-07-2026 12:59 AM
బాలానగర్ జూలై 27: రైతులకు మేలు చేసే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంను అమలు చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం బీజేపీ నాయకులు అందజేశారు. రైతులు ప్రకృతి విపత్తులు, పంట నష్టాల నుంచి ఆర్థికంగా రక్షణ పొందేందుకు ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వారు కోరారు.
కేంద్రం రాష్ట్రం అంటూ వేరు చేసి రైతులకు అన్యాయం చేయకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు సురేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు భరత్, సందీప్, బీజేపీ కార్యదర్శి సాయి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






