26 May, 2026 | 2:18 AM

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

26-05-2026 01:09 AM

సిరిసిల్ల మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమి

రాజన్న సిరిసిల్ల 25మే (విజయక్రాంతి )సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షుడు ఎండి సత్తార్ మాట్లాడుతూ, దేశంలోని ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముస్లింలు పెద్ద జంతువుల కుర్బానీకి దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు చిన్న జంతువులను కుర్బానీ చేయాలని సూచించారు.

అలాగే దేశంలోని వివిధ ముస్లిం నాయకులు, ఉలేమాలు (మత పెద్దలు) కూడా ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతున్నారని తెలిపారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆవులు మరియు ఇతర పశువుల విక్రయాన్ని సాధ్యమైనంత వరకు నివారించాలని అన్నారు.

సిరిసిల్ల ఈద్గాహ్లో నిర్వహించనున్న బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) నమాజ్ సమయాలను కూడా ప్రకటించారు. నిర్ణయించిన సమయానికి హాజరై, క్రమశిక్షణతో నమాజ్లో పాల్గొనాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సోహెల్, మాజీ మజీద్ కమిటీ అధ్యక్షుడు, షేక్ యూసుఫ్, ముస్తఫా, గౌరవ అధ్యక్షులు సయ్యద్ సమ్మద్, కమిటీ జనరల్ సెక్రెటరీ  మొహమ్మద్ రఫీ మహమ్మద్ మునీర్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫయాజ్, ఎండి చాంద్ పాషా, మహమ్మద్ అమ్జాద్, షేక్ బాసు, పాషా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.