29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

విశ్వశాంతి విద్యార్థిని అభినందించిన మంత్రి తుమ్మల

26-05-2026 01:10 AM

సత్తుపల్లి, మే 25 (విజయక్రాంతి): తెలంగాణ పాలీసెట్ 2026 ప్రవేశ పరీక్షలో 120/120 మార్కులతో రాష్ట్ర ప్రథమ స్థానం ( స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ) సాధించిన విశ్వశాంతి స్కూల్ (సత్తుపల్లి) విద్యార్థి ఎం.డి. అర్ఫాజ్ అలీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు సోమవారం ఘనంగా సత్కరించారు. అర్ఫాజ్‌ను శాలువా పుష్పగుచ్ఛంతో అభినందించారు. సత్తుపల్లి ప్రాంతం నుంచి తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు రావడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ చదువు  మనిషి జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తివంతమైన సాధనమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ఉన్నత విద్యలో రాణించి సత్తుపల్లి ఖ్యాతిని మరింత పెంచాలని అర్ఫాజ్కు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి స్కూల్ యాజమాన్యం పసుపులేటి నాగేశ్వరరావు నరుకుళ్ల సత్యనారాయణ విద్యార్థి తండ్రి అఫ్జల్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను తుమ్మల  అభినందించారు.