విస్తరిస్తున్న ఫామ్‌హౌస్ కల్చర్
అనుమతులు లేకుండానే... అసాంఘిక శక్తులకు అడ్డా...
కరీంనగర్, జూలై 2 (విజయక్రాంతి): కరీంనగర్ చుట్టుపక్కల ఫామ్ హౌస్ కల్చర్ వేగంగా విస్తరిస్తుంది. వారాంతపు విడిది, కుటుంబ వేడుకలు, స్నేహితులతో పార్టీలు, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపడానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. థీమ్స్: ఆధునిక సౌకర్యాలతో కూడిన సాధారణ ఫామ్ హౌస్లతో పాటు, ’కేరళ నాలెక్కెట్టు’ వంటి ప్ర త్యేకమైన డిజైన్లు , వింటేజ్ లుక్ ఉన్న ఫామ్ హౌస్లు అందుబాటులో ఉన్నాయి.
వసతులు: 2 నుండి 4 వరకు ఏసీ బెడ్రూమ్లు, ప్రైవే ట్ స్విమ్మింగ్ పూల్స్, బ్ఫోర్, అవుట్డోర్ సిని మా, మరియు మ్యూజిక్ సిస్టమ్స్ వంటి సౌ కర్యాలు లభిస్తున్నాయి. ఫామ్ హౌస్ రకాన్ని బట్టి, సాధారణ రోజుల్లో రూ. 10,000 నుండి ప్రారంభమై, వారాంతాల్లో (వీకెండ్స్) ధరలు మారుతుంటాయి. నుస్లాపూర్, నల్లగొండ, మల్కాపూర్, ఎలబోతరం, కమాంపూర్, సదశివపల్లి, చెంజర్ల, దురుషేడ్ శివారు ప్రాంతాలలో ఇటువంటి ఫామ్ హౌస్లు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల ఓ ఫామ్ హౌస్ లో యువకుని మృతి సంఘటన వ్యాసనకారులకి ఇవి అడ్డాగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
అనుమతులు లేకుండానే
కరీంనగర్ చుట్టుపక్కల వ్యవసాయ భూములను అక్రమంగా ఫామ్ హౌస్లుగా మార్చి, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. నగర శివార్లలోని కొత్తపల్లి, రైకుర్తి, మానకొండూర్, వెలిచాల్, కమలాపూర్ ప్రాంతాలలో ఇటువంటి నిర్మాణాలు అధికంగా వెలిశాయి. సరైన మున్సిపల్, సూడా,గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూములను కమర్షియల్ వెంచర్లుగా మార్చి, రియల్ ఎస్టేట్ నిబంధనలు, లేఅవుట్ పర్మిషన్లు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు.అసాంఘిక కార్యకలాపాలు: రహస్యంగా నిర్వహిస్తున్న ఈ ఫామ్ హౌస్లలో మద్యం, పేకాట, డ్రగ్స్ వంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.






