13-11-2025 12:21:05 AM
-తేమశాతం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలి
-బాధిత రైతును పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి) : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కాపాస్ కిసాన్ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. రైతులకు కిసాన్ కాపాస్ యాప్ పై కనీసం అవగాహన కల్పించలేదన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పోచ్చర గ్రామంలోనీ కౌలు రైతు ఎగిడే సురే ష్ ఆరు కాలం కష్టపడి పండించిన పత్తి పంట ను ఇంట్లో నిల్వ ఉంచగా, ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్దం అయింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న బుధవారం దగ్దం అయిన పత్తిని పరిశీలించి, రైతుని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని రైతుకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు విఫలం ఐయ్యరన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిగించిన తేమ నిబంధన లు రైతులను ఊపిరాడకుండా చేస్తున్నాయన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తరహాలో నేడు పత్తిని తేమశాతం లేకుండా కొనుగోలు చేయాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి భరో సా ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా రైతులను పూర్తిగా నిస్సహాయతకు గురిచేస్తుందన్నారు. కార్యాలయంలో నాయకులు సేవ్వా జగదీష్, కిష్టారెడ్డి, ఆశన్న, సంజీవరెడ్డి, దయాకర్, సీను, పెట్టపర్తి అశోక్ పాల్గొన్నారు.