calender_icon.png 10 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చాకలి ఐలమ్మ వర్థంతి

10-09-2025 06:27:02 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి 40వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షుడు బూసిరాజుల చిన్న లింగన్న మాట్లాడుతూ... చాకలి ఐలమ్మ అడుగుజాడలో రజకలందరు నడవాలని పిలుపునిచ్చారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్లా సత్తయ్య, మందపల్లి మున్నా, మునిగంటి శీను, మందపల్లి రాజు, నస్పూర్ సత్తయ్య, మందపల్లి శంకర్, మందపల్లి తిరుపతి, బూసిరాజుల పెద్ద లింగం, నస్పూర్ లింగన్న, ఆయిళ్ల రాజన్న, మందపల్లి శేషు పాల్గొన్నారు.