calender_icon.png 10 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వెల్కమ్ పార్టీ

10-09-2025 06:25:37 PM

సదాశివనగర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేల్కమ్ పార్టీని బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమలు కేరింతలతో విద్యార్థిని విద్యార్థులు సభా వేదికను ఉర్రుతలూగించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలాం(District Intermediate Officer Sheikh Salam) హాజరై విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడరు. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే ఏదైనా సాధించవచ్చు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చని, చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. మండల విద్య శాఖ అధికారి యోసఫ్ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు విద్యను నేర్చుకుంటే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గువ్వ భూదేవి, కమిటీ మెంబర్ లావణ్య, అధ్యాపక, అధ్యాపకేతన బృందం పాల్గొనడం జరిగింది.