కార్పొరేషన్ కార్మికుడి మృతి బాధాకరం
ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం, ఆగస్టు 16, (విజయక్రాంతి ): విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతూ మున్సిపల్ కార్మికుడు భూక్యా జైత్రామ్ మృతి చెందడం బాధాకరమని, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం మంగపేట 23వ డివిజన్కు చెందిన మల్టీ పర్పస్ కార్మికుడు జైత్రామ్ విద్యుత్ దీపాలు అమర్చుతూ స్తంభంపై నుంచి జారిపడి తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.
ఖమ్మంలోని మమత జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారని తెలియడం తో ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశా రు. కార్మికుడికి రావాల్సిన అన్ని రకాల టెర్మినల్ బెనిఫిట్స్ ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన కుటుంబ సభ్యులకు అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూ తిని తెలియజేస్తూ, న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా, మేయర్ గణేష్ భరోసా ఇచ్చారు.






