21 July, 2026 | 12:12 PM

ఢిల్లీ పోలీసుల లాఠీచార్జ్ అత్యంత అప్రజాస్వామికం

21-07-2026 12:32 AM

ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి) : శాంతియుతంగా, నిరాయుధులుగా నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత అప్రజాస్వామిక మైనదని, సిగ్గుచేటన్నారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రశ్న లకు సమాధానాలు లాఠీలు, టియర్ గ్యాస్‌తో ఇవ్వలేరని, దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కల్పించిందని,

ఆ హక్కును బలప్రయోగంతో అణచివేయడం సాధ్యం కాదని స్ప ష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాం డ్ చేశారు. బాధ్యతను కోరుతూ పోరాడుతున్న ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరుడికి తన సంఘీభావం ప్రకటిస్తూ, అందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.