26 May, 2026 | 1:02 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

జనగణనలో ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలి

02-04-2026 01:13 AM

జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): పకడ్బందీగా జనగణన మొదటి విడతలో చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తహసిల్దార్లను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలోని ఇండ్ల గణన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జన గణన మొదటి దశలో బాగంగా చేపట్టే ఇండ్ల గణన ప్రక్రియ వచ్చే నెల మే 11నుంచి జూన్ 9 వరకు నిర్వహించే ఇండ్ల గణనకు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఇండ్ల గణన జాబితా బ్లాక్ లను తయారు చేయడానికి మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని గరిష్టంగా 300 ఇండ్లు లేదా 800 జనాబా ఉండేటట్లు ఇండ్ల గణన బ్లాక్ లను CMMS పోర్టల్ ద్వారా తయారు చేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా పటిష్టంగా జనగణన బ్లాకుల రూపకల్పన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. CMMS పోర్టల్ నిర్వహణ చేసే ప్రక్రియ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చేసేందుకుతగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్, ఎంపీడీవోలు అధికారులు పాల్గొన్నారు.