calender_icon.png 15 December, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి ఎమ్మెల్యే జారె

10-12-2025 12:37:21 AM

ములకలపల్లి,డిసెంబర్ 9(విజయ క్రాంతి):గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరారు. ములకలపల్లి మండలంలో ఈనెల 14 వ తేదీన జరుగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించారు.

సర్పంచ్, వార్డు అభ్యర్థులతో గ్రామస్థాయిలో స మావేశాలు నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను, ప్రచారాన్ని సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాల వారీగా అభ్యర్థుల పరిస్థితి, ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యల పరిష్కారాలపై నాయకులతో చర్చించారు. గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు,మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి, పేటేటి నరసింహారావు, కొప్పుల రాంబాబు,కరటూరి కృష్ణ, పువ్వాల మంగపతి, కారం సుధీర్, గాడి తిరుపతిరెడ్డి, మేకల వెంకటేశ్వర్లు, , అనుమల్ల నరసింహారావు, పీడియాల బుజ్జి, కొండ్రు భాస్కర్, అడపా హా రిక, సురభి రాజేష్, పద్మశ్రీ, జయసుధ,సిపిఐ నాయకులు నరాటి ప్రసాద్, రమేష్, సిపిఎం నాయకులు దేవేందర్,రాఘవయ్య,రావుజా తదితరులు పాల్గొన్నారు.