calender_icon.png 13 December, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిబంధనలను పాటించాలి

10-12-2025 12:38:34 AM

ములకలపల్లి, డిసెంబర్ 9(విజయ క్రాంతి):గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సతీష్ కుమార్ సూచించారు. గ్రామపంచాయతీల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జగన్నాధపురం ఉన్నత పాఠశాలలో వివిధ పార్టీల నాయకులు,అభ్యర్థులతో ములకలపల్లి పోలీసు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్నికల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.

పంచాయితీల ఎన్నికల ప్రచారం ఈనెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని, 14వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్ జరుగుతుందని అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎవరైనా ఎన్నికలకోడ్ ను ఉల్లంఘిస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనవసరంగా కేసుల పాలు కావద్దని సూచించారు. ములకలపల్లి ఎస్త్స్ర మధు ప్రసాద్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.