calender_icon.png 15 December, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి

10-12-2025 12:36:49 AM

సర్పంచ్ అభ్యర్థి దారుణ శ్రీనివాస్

భీమదేవరపల్లి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ముల్కనూర్ గ్రామంలోని పూర్తిగా వెనుకబడిన శ్రీనివాస నగర్, నరహరి తండా, బుడిగ జంగాల కాలనీ, కోటగడ్డలతో పాటు వడ్డెర కాలనీ పూర్తిగా అభివృద్ధి చేయడమే ధ్యేయమని సర్పంచ్ అభ్యర్థి దారుణ శ్రీనివాస్ అన్నారు. మీడి యా సమావేశంలో శ్రీ ను మాట్లాడుతూ అంగ డి బజార్‌లో మరుగుదొడ్లు, టెంపరరీ ప్లాట్ ఫామ్స్‌తోపాటు లైటింగ్ సిస్టం సర్పంచ్‌గా ఎన్నిక కాగానే నెలలోగా పూర్తి చేస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. మహిళల కోసం బతుకమ్మ బండ పూర్తిస్థాయిలో లెవెల్ చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న శ్రీనివాస్ నగర్ ను మద్దివారిపల్లిను అభివృద్ధి చేయడమే ధ్యేయమన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించాల్సిగా అభ్యర్థించారు.