1 July, 2026 | 12:59 AM

ప్రభుత్వ ఆసుపత్రులపై అపోహలు వీడాలి

01-07-2026 12:00 AM

మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్ నాయక్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్ 30:  ప్రభుత్వ ఆసుపత్రులపై గర్భిణీలు అపోహాలు వీడి,ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు పొంది సిజేరియన్ లకు అవకాశం ఇవ్వకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్ కోరారు.మండల పరిధిలోని కొమ్మాల గ్రామానికి చెందిన గర్భిణీ గంగాదెరి శిరీష పురిటి నొప్పులతో సోమవారం అర్వపల్లిలోని పీహెచ్సీలో చేరారు.

పరీక్షించిన వైద్య సిబ్బంది అర్ధరాత్రి దాటాక వైద్యాధికారి డాక్టర్ నగేష్ నాయక్ ఆధ్వర్యంలో సాధారణ ప్రసవం చేయగా 4.4 కిలోల బరువుతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని,తల్లి బిడ్డలిద్దరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన చెప్పారు.అసాధారణమైన కాన్పును కూడా సాధారణ ప్రసవం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించిన వైద్యాధికారి డాక్టర్ నగేష్ ను పలువురు అభినందించారు.ఈ డెలివరీ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లు సునీత,మాధవి,ఆశా కార్యకర్త రోజా,ఆయా శైలజ పాల్గొన్నారు.