calender_icon.png 10 February, 2026 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి

10-02-2026 12:00:00 AM

జీహెచ్‌ఎంసి కమిషనర్‌ను కోరిన గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రభుత్వం మంజూరు చేసిన జీహెచ్ ఎంసి కార్పొరేటర్ నిధులు రూ. 2 కోట్ల నుండి రూ.1 కోటి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు వెంటనే ప్రారంభోత్సవాలు జరపాలని జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్ వి. కర్ణన్‌కు గాంధీనగర్ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ సోమవారం వినతి పత్రా న్ని సమర్పించారు.

గాంధీనగర్ డివిజన్ జీహెచ్‌ఎంసి కార్పొరేటర్ ఫండ్స్ లోని మరో రూ.1కోటి నీ వెంటనే మంజూరు చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన కమిష నర్ వెంటనే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆదేశాలు జారీ చేస్తూ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ పాల్గొన్నారు.