8 April, 2026 | 8:07 PM

గుట్టను తవ్వుతున్న ఘనులు!

08-12-2024 12:45 AM

గోలగుండంలో అక్రమార్కుల మట్టి దందా

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమార్కులు గుట్ట మట్టిని తవ్వి దందా చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం ఆలేరు రెవెన్యూ గ్రామ శివారు గోలగుండం గ్రామంలో కొందరు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు రియల్‌ఎస్టేట్ వ్యాపారం కోసం గుట్ట మట్టిని తవ్వి, సొమ్ముచేసుకుంటున్నారు.

పర్యావరణానికి హాని చేస్తున్నా సంబంధిత అదికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైతుపొ లాల నుంచే మట్టి లోడుతో వాహనాలు వెళ్తుండటంతో సేద్యం చేసే భూములు ధ్వంసం అవుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయినా కూడా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పెడచెవిన పెడుతున్నారు.

యథేచ్ఛగా ఇసుక దందా

రెచ్చిపోతున్న  అక్రమార్కులు

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నా అధికారు లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కిన్నెరసాని, మొర్రెడు వాగుల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒక ప్రదేశంలో డంప్ చేసి.. రాత్రి వేళ ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

అక్రమ రవాణాను అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు కొందరు వ్యాపారులకు మద్దతిస్తు న్నట్టు ఆరోపణలున్నాయి. పాల్వంచ పరిధిలోని మొర్రెడు వాగు నుంచి కుంటినాగుల గూడెం, పేటచెరువు, జగ్గుతండా, ఎర్రగుంట, పాత పాల్వంచ మండల పరిధిలోని రంగాపురం, బూర్గంపాడు మండలంలోని కిన్నెరసాని, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలంలోని మొర్రెడువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది.