8 April, 2026 | 6:22 PM

చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు సుస్తి

08-12-2024 12:41 AM
  1. ప్రకటనలకే పరిమితమైన ‘డయాలసిస్’
  2. ప్రారంభానికి నోచుకోని పోస్ట్‌మార్టం గది

చర్ల, డిసెంబర్ 7: గిరిజనులకు వైద్య సేవలు అందించాల్సిన చర్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు సుస్తి చేసింది. శవపరీక్షకు వెళ్లాలన్నా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ధి చేయించాలన్నా.. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ఆసుపత్రికి వెళ్లాల్సిందే. సీహెచ్‌సీకి అన్ని పరికరాలు తీసుకొచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

అయితే టెక్నీషియన్స్‌ను నియమించకపోవటంతో సేవలు అందడం లేదు. ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు హడావుడి చేసి.. తర్వాత చల్లబడ్డారు. పోస్ట్‌మార్టం కోసం రూ.లక్షలు వెచ్చించి గదిని నిర్మించారు కానీ నేటికీ ప్రారంభించక పోవటంతో శవపరీక్షకు భద్రాచలం వెళ్తున్నారు.

అసలే ఏజెన్సీ ప్రాంతం, విష జ్వరాలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్న ప్రాంతంలోని ఆసుపత్రిలో రక్త పరీక్ష కోసం వెళ్తే పరిక రాలు మరమ్మతులో ఉన్నాయని సిబ్బంది సమాధానం. అత్యవసరమై తే కొయ్యూ, సత్యనారాయణపురానికి పరు గు తీయాల్సిందే.

మెటర్నటి వార్డు నిర్మించినా.. ఎమర్జెన్సీ కేసులను భద్రాచలానికి పంపించే పరిస్థితి. విశాలమైన గదులు, వసతులున్నా సిబ్బంది లేక చర్ల ఆసుపత్రి నిరు పయోగంగా మారింది. ఆసుపత్రిలో సమ స్యలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.