calender_icon.png 14 February, 2026 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతి స్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

14-02-2026 12:00:00 AM

మేడిపల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):  మతి స్థిమితం లేని వ్యక్తి అదృష్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాళ్ల పద్మజా తన భర్త తాళ్ల నర్సింగ్ రావు (58) తో పీర్జాదిగూడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర నివాసం ఉంటున్నారు. భర్త  తల్లా నర్సింగ్ రావు గత 15 సంవత్సరాల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. గత సంవత్సరo నుండి మతిస్థిమితం కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నెల 10న ఎప్పటిలాగే  పాన్ షాప్‌కి వెళ్ళివస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి, తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించక పోవడంతో, భార్య పద్మజా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని  మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.