calender_icon.png 14 February, 2026 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

14-02-2026 12:00:00 AM

నిర్మల్ పీఠంపై హస్తం 

ఖానాపూర్‌లో మూడు పార్టీలకు ఆదరణ 

బైంసాలో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం

మున్సిపల్ చైర్మన్‌గా అప్పల కావ్య 

బీజేపీకి 13 స్థానాలు 

నిర్మల్ ఫిబ్రవరి 13 ( విజయక్రాంతి): జిల్లాలో శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని నిర్మల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలకు గాను 24 స్థానాలు గెలుచుకొని మున్సిపల్ పిఠా న్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ 13 ఎంఐ 3 బీఆర్‌ఎస్ రెండు స్థానాలు విజ యం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి, భారత రాష్ట్ర సమితి, ఎంఐఎం పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు 

మున్సిపల్ చైర్మన్‌గా అప్పాల కావ్య 

నిర్మల్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ 33వ అభ్యర్థి అప్పల కావ్య గణేష్ చక్రవర్తిచక్రవర్తి నీ ప్రకటిస్తున్నట్టు జిల్లా డిసిసి అధ్యక్షులు వేడుమడుమ బొజ్జు పటేల్ తెలిపారు. నిర్మ ల్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు అప్పల కుటుంబానికి చెందిన అప్పల నరసయ్య అప్పల అనురాధ అప్పల గణేష్ చక్రవర్తి మున్సిపల్ చైర్మన్ గా పని చేయగా తాజాగా ఆయన సతీమణి అప్పల కావ్య మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు కాంగ్రెస్ పార్టీ విజయానికి చైర్మన్ అభ్యర్థి అప్పల గణేష్ తో పాటు మాజీ మంత్రులు వేణుగోపాలచారి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ డిసిసి అధ్య క్షులు గ్రంథం లయ చైర్మన్ అర్జున్ మంత్ అలీ సమన్వయంతో పనిచేయడంతో విజయం సాధించారు

ప్రతిపక్షాల పార్టీలకు దక్కని ఆదరణ. 

నిర్మల్ మున్సిపాలిటీలో ఎలాగైనా అధికార పగ్గాలు చుకోవడం రాజకీయ ప్రాబ ల్యం పొందాలనుకున్న రాజకీయ పార్టీలకు ఓటర్ల తీర్పు భిన్నంగా వచ్చింది. బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి సొంత మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా టిఆర్‌ఎస్ రెండు స్థానాలు ఎంఐఎం మూడు స్థానాలకు పరిమితమైంది.