03-05-2025 08:48:44 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజల దాహార్తి తీర్చేందుకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యహియా అంబలి పంపిణీ చేయడం అభినందనీయమని సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలకు అంబలి పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి సంవత్సరం వేసవిలో వారసంత రోజు శనివారం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు అంబలి పంపిణీ చేసి వారి దప్పిక తీర్చడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వినాయక, శంకర్, భీమ్రావు నాయకులు రహమాన్, ముబాషీర్, మేరాజ్ తదితరులున్నారు.