03-05-2025 08:53:08 PM
కామారెడ్డి (విజయక్రాంతి): వ్యవసాయ బావి వద్ద, బోర్ లు వేసిన పడకపోవడం, అందుకోసం చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పంతులు పెంటయ్య(26) యువరైతు, గత 7, 8 నెలల నుంచి తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో సుమారు 10 బోర్ల వరకు వేయించాడు. బోర్లు పడక నీరు రాకపోవడంతో, బోర్లు వేయించేందుకు చేసిన అప్పులు తీర్చే స్తోమత లేక, ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుని తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు దోమకొండ ఎస్ఐ స్రవంతి వివరించారు.