10-01-2026 12:03:55 AM
కలెక్టర్ రాజర్షి షా
బేల, జనవరి 9 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాప్‌లో నిలవాలనీ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం బేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్.ఓ వాటర్ ప్లాంట్ను కలెక్టర్ ప్రారంభిచి, పాఠశాల ఆవరణ లో మొక్కను నాటారు.
అనంతరం సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అంతకుముం దు పాఠశాలలో కిచెన్ షెడ్, ఆరోగ్య పాఠశాల కార్యక్రమాలపై గోడలపై పెయింటింగ్‌లను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్, ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమి టీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, దాతలు, విద్యార్థులు పాల్గొన్నారు.