10-01-2026 12:00:00 AM
ఉట్నూర్, జనవరి 9 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని డాక్ట ర్ బి.ఎం.బి.ఆర్ అంబేద్కర్ కూడలి వద్ద ప్రధాన రహదారిపై యువజన కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు అరికిల్ల పరమేశ్వర్ రావు, మండల శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యం లో కేటీఆర్ దిష్టిబొమ్మ ను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాను జవంత్‌లతో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.