21 April, 2026 | 11:21 PM

దవాఖానలోనే నర్సుపై డాక్టర్ లైంగికదాడి

21-08-2024 03:45 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వైద్యుడు తనవద్ద పనిచేసే నర్సుపైనే దారుణానికి పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు దవాఖానలో పనిచేసే 20 ఏండ్ల నర్సు ఈ నెల 17 తేదీల రాత్రి విధుల్లో ఉండగా బాధితురాలిని తోటి నర్సు మెహనాజ్ అక్కడ పనిచేస్తున్న డాక్టర్ షానవాజ్ గదికి వెళ్లాలని సూచించింది. అందుకు బాధితురాలు నిరాకరిచటంతో మెహనాజ్‌తోపటు వార్డుబాయ్ జునైద్ ఆమెను బలవంతంగా వైద్యుడి గదిలోకి నెట్టి బయటనుంచి గడియ పెట్టారు. ఆ వెంటనే గదిలోకి వచ్చిన షానవాజ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. కేసు నమోదుచేసుకొన్న పోలీ సులు డాక్టర్ షానవాజ్, నర్సు మెహనాజ్, వార్డ్‌బాయ్ జునైద్‌ను అరెస్టు చేశారు.