కొండచరియల ధాటికి కుప్పకూలిన పవర్ స్టేషన్
21-08-2024 03:34 AM
సిక్కిం, ఆగస్టు 20: సిక్కింలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగ ళవారం కొండచరియలు విరిగిపడి తీస్తా స్టేజ్ 5 డ్యామ్‌కు ఆనుకుని ఉన్న పవర్ స్టేషన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొన్ని వారాలు గా తరచూ కొండచరియలు విరిగి ప డుతుండడంతో ఈ పవర్ స్టేషన్‌కు ముప్పు ఉందని మూసివేశారు. మంగళవారం ఉదయం భారీ ఎత్తున కొండచరియలు భవనం మీద పడేసరికి పవర్ స్టేషన్ నేలమట్టం అయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 510 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న ఈ పవర్ స్టేషన్‌ను నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) నిర్వహిస్తోంది.






