15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఏడాదికే డ్రైనేజీ శిథిలం!

13-06-2025 01:37 AM
  1. అధికారుల పర్యవేక్షణ కరువు

సంవత్సరానికే కుంగిన డ్రైనేజీ

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 12 (విజయ క్రాంతి): పారిశ్రామిక ప్రాంతమైన అప్పటి పాల్వంచ పురపాలకన్, ప్రస్తుతం కొత్తగూ డెం నగరపాలక సంస్థలో క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గత 30 సంవత్సరాలుగా పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడం ప్రజల్లో అనేక ఇబ్బందులను గురిచేస్తున్నాయి.

గత ఏడాది కాంట్రాక్ట్ కాలనీలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ ఏడాది గడవకముందే కుంగిపోవటంతో మురుగునీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. మూడు నెలలైనా అధికారులు అటువైపు చూసిన దాఖలాలు లేవు. వనమా కాలనీలో రోడ్డుపైన నిర్మించిన ఇల్లు ద్విచక్ర వాహన చోదకులకు ప్రమాద భరితంగా మా రింది. ఒక స న్ను నుంచి ప్ర ధాన రోడ్డుకు ప్రయాణించాలంటే ర్యాంప్ ఎత్తు భాగంలో ఉంది.

దీంతో వాహనం వేగంగా వస్తే తప్ప ప్రధాన రోడ్డు పైకి వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు మెం డుగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో నిర్మించిన ఇల్లు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇవి కేవలం మచ్చుతులకాల మాత్రమే. పాల్వంచలోని 22 వార్డుల్లో ఇలాంటి సమస్యలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికైనా పట్టణ ప్రణాళిక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.