calender_icon.png 10 October, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

10-10-2025 08:13:15 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో రెండు బస్సులు ఎదురుగా ఢీకొన్నాయి. శుక్రవారం ఉదయం సారపాక మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఆర్టీసీ బస్సులు ఢీకొనగా బస్సులో ప్రయాణిస్తున్న  పలువురికి గాయాలు అయ్యాయి.భద్రాచలం నుండి ఖమ్మం కి వెళ్తున్న బస్సు ఖమ్మం నుండి భద్రాచలం నుంచి వస్తున్న బస్సు ఢీ కొన్నాయి. గాయాల పాలైన వ్యక్తులను 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.