calender_icon.png 10 October, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన దుకాణం

10-10-2025 08:24:51 AM

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలోని అయ్యప్ప హాట్ చిప్స్(Ayyappa Hot Chips) దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో అయ్యప్ప హాట్ చిప్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధమైంది. రూ.6 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు షాపు నిర్వహకులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.