10-10-2025 09:13:07 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేటలో మొసలి(Crocodile) కలకలం రేపింది. తారామతిపేట నుంచి మూసీనదిలోకి వెళ్లే కాలువ ద్వారా మొసలి వచ్చింది. మొసలిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో అటవీ శాఖ అధికారులు మొసలిని బంధించారు. అనంతరం మొసలిని అధికారులు జూపార్క్ కు తరలించారు.