9 May, 2026 | 2:46 AM

పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం

09-05-2026 12:12 AM

జప్తి జానకంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

నాగిరెడ్డిపేట్ మే 8 (విజయ క్రాంతి): మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో భోగాల పోచమ్మ, కాశయ్యలకు లబ్ధిదారులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా గ్రామ సర్పంచి వర్షిని రిబ్బన్ కట్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పాల్గొని  ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని తెలిపారు.

గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సర్పంచ్ వర్షిణి పరమేష్, ఎంపీవో ప్రభాకర్ చారి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగలి బాబు, దుర్గయ్య,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శంకర్, జీపీఓ రాజు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.