calender_icon.png 21 July, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమితాబ్ డాన్ చిత్ర దర్శకుడు ఇకలేరు

21-07-2025 12:12:32 AM

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ (86) ఆదివారం కన్ను మూశారు. గత ఏడేళ్లుగా పల్మనరీ ఫైబ్రోసిస్తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1978లో అమితాబ్‌బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘డాన్’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. 

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడమే కాక బిగ్‌బీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. చంద్ర బారోట్ ఐదు సినిమాలను తెరకెక్కించారు. 1970లో తొలిసారిగా పురబ్-పశ్చిమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఆ తర్వాత మరో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనీచేశారు.

ఇక అమితాబ్ ‘డాన్’.. సినిమాలకు ఓ ఒక పుస్తకంలా మారింది. బాలీవుడ్‌లో ఇప్పటికే డాన్ సిరీస్లో ఇప్పటికే రెండు సినిమాలు షారుక్ ఖాన్ హీరోగా వచ్చాయి. త్వరలో రణ్వీర్ సింగ్ హీరోగా డాన్-3 సైతం రానున్నది. చంద్ర బారోట్ క్లాసిక్ మూవీ డాన్‌ను రీమేక్ చేసిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ నివాళులర్పించారు.