21-07-2025 01:30:06 PM
హైదరాబాద్: గతంలో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాలనను గద్దర్ మెచ్చుకున్నారని బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Former Minister Tanniru Harish Rao) అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని హరీశ్ రావు సూచించారు. అన్ని మండలాల్లో బీఆర్ఎస్ నేతలను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.