కిస్మత్పూర్, హిమగిరినగర్‌లో మంచినీటి సమస్య తీరినట్లే..
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రూ.48లక్షలతో మంచినీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
రాజేంద్ర నగర్ జూన్ 5 (విజయక్రాంతి): కిస్మత్ పూర్ హిమగిరి నగర్ లో ఇకనుండి మంచినీటి సమస్య తీరినట్లేనని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ తెలిపారు. కిస్మత్పూర్ సెక్షన్ పరిధిలోని శివాలయ టెంపుల్ నుండి హిమగిరి నగర్ రోడ్ నెం.07 వరకు త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి ఆధ్వర్యంలో చేపట్టనున్న నూతన పైప్లైన్ పనులకు శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన వేశారు. ఇకనుండి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య తీరనుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు నిరంతరం నాణ్యమైన నీటిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ జి ఎం లక్ష్మి . డీజీఎం జవహర్ అలీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






