19-12-2025 11:18:12 PM
చేగుంట, డిసెంబర్ 19 : చేగుంట - మెదక్ వెళ్లే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ స్థానిక ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు అడ్డంగా ఉన్నచెట్ల తొలగింపు, మి షన్ భగీరథ వాటర్ పైప్లైన్ను, పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా, నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ పోల్స్ వేరే చోటికి తరలించ డం, నిర్మాణ పనుల సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసర మైన దారి మళ్లింపు జాగ్రత్తలను సిద్ధం చేసి అమలు పరుచుటకు సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు.