20-12-2025 12:00:00 AM
కేసముద్రం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో శుక్రవా రం పెద్దమ్మతల్లి దేవాలయంలో ముదిరాజ్ కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది క్రితం నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన తర్వాత నిత్య పూజ నిర్వాహణ కమిటీ సభ్యుల సమన్వయంతో, ముదిరాజ్ కులసంఘ సభ్యుల స హాయసహకారాలతో మా ఊరి పెద్దమ్మతల్లికి ఎలాంటి ఆటంకం రాకుండా నిత్య పూ జాసేవలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం నిర్వహణ వలన సభ్యులందరిలో క్రమశిక్షణ తో పాటు , సంఘటిత భావంతో ఐక్యంగా కలిసి నడవడం అనే మంచి లక్షణాలు పెం పొందించబడ్డాయన్నారు. వంతులవారీగా చేసినప్పటికీ నిత్యధూపధీపారాధనతో దైవాశీస్సులు అందరిపై ఉంటాయనే విశ్వాసంతో మా అందరిలో దైవభక్తితో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు.