27 February, 2026 | 9:03 AM

బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం

27-02-2026 12:11 AM
  1. కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు   

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్  

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి) : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేయడంతో పాటు కమీషన్ల పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమా ర్ మండిపడ్డారు.ఆ ప్రాజెక్ట్ పేరుతో తీసుకొచ్చిన అప్పులకు ప్రతి నెల రూ. 6 వేల కొట్ల చొప్పున ఇప్పటి వరకు రూ. 47వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గురువారం గాంధీ భవన్‌లో మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పార్టీ నేత రామ్మోహన్‌రెడ్డితో కలిసి మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు.

రైతు భరోసా, మూసీ ప్రక్షాళన కోసం బీఆర్‌ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నామని, బీఆర్‌ఎస్ నేతలకు మా త్రం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వంపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటిల్లో నాలుగు అమలు చేస్తున్నామని మరో రెండు గ్యారంటీలు అమలు చే స్తామని మంత్రి తెలిపారు.

విద్యతోనే సమాన అవకాశాలు 

ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో సమాన లభించాలంటే చదు వు ఒక్కటే మార్గామని మంత్రి  అన్నారు.  లోయర్ ట్యాంక్ బండ్‌లోని అం బేద్కర్ భవన్, కాచిగూడలోని ఎస్సీ హాస్టల్‌ను మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహు లు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో కలిసి మంత్రి అడ్లూరి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్‌ను మోడరన్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.

కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకాడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధంచే స్తున్నట్లు తెలిపారు.   దళిత విద్యార్థులకు ఢిల్లీ స్థాయి సివిల్స్ కో చింగ్ సౌకర్యాలను హైదరాబాద్‌లోనే అందించేలాచర్యలు తీసుకుంటున్నామన్నారు.   కార్యక్రమంలో కాచి గూడ హాస్టల పూర్వ విద్యార్థులు రుద్రవరం లింగస్వామి, బోయి న శ్రీనివాస్, గిరి, భూషిపాక గణేశ్, గోవిందు పాల్గొన్నారు.