2 April, 2026 | 4:01 PM

Breaking News

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి   •   గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే నిధులు ఖర్చు   •   నిరంతర సంక్షేమం.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం   •   ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమ కార్యక్రమాలు   •   కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న రేవంత్ — ఇప్పటివరకు ఏం చేశారు?   •   కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •  

బయటపడుతున్న బీఆర్‌ఎస్ అసలు రంగు

13-09-2024 01:11 AM

టీ పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఆంధ్రా సెటిలర్స్ అంటూ, బతక వచ్చిన వారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీ పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్‌లోనే ఆ పార్టీ ప్రాంతాల పేరుతో విద్వేషాలు రాజేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చీలిక మొదలైందని, గౌరవ మర్యాదలు కోరుకునే వాళ్లెవరూ కౌశిక్‌రెడ్డితో పడలేక బయటకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు.