ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి తాళం

28-04-2024 12:56:39 AM

అవస్థలు పడుతున్న సిబ్బంది, రోగులు

పట్టించుకోని పాలకులు, అధికారులు

జహీరాబాద్, ఏప్రిల్ 27: పట్టణంలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ దవఖానకు తాళం పడిం ది. దీంతో వైద్య కోసం వచ్చే రోగులు అవస్థ లు పడుతున్నారు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీ దవఖానకు సొంత భవనం లేక అద్దె భవనంలో కొనసాగుతుంది. గత రెండేండ్లుగా అద్దె చెల్లించడం లేదని భవన యాజమాని శనివారం దవఖానకు తాళం వేశారు. దీంతో సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది, రోగు లు ఇబ్బందులు పడుతూ ఆరుబయటే ఉండాల్సి వచ్చింది.

సొంత భవనం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజాప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా భవనానికి అద్దె చెల్లించకపోవడంతో భవన యాజమాని తాళం వేశా డని వైద్యాధికారులు చెప్తున్నారు. అద్దె విషయమై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామ ని పేర్కొన్నారు. అధికారులు స్పందించి  దవఖానకు  సొంత భవనాన్ని సమకూర్చాలని కార్మికులు, రోగులు కోరుతున్నారు.