31 July, 2026 | 1:09 AM

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా తగ్గించాలి

31-07-2026 12:19 AM
  1. బీసీల నోటికాడ బుక్క లాగేస్తున్న ‘రెడ్డి’ ప్రభుత్వం
  2. టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై 30(విజయక్రాంతి): రాష్ట్రంలో విడుదలైన 7,437 పోలీస్ పోస్టు ల భర్తీ ప్రకటన వెనుక బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, ప్రభుత్వ మోసా న్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీల ఉద్యోగాలను ‘దొంగతనంగా’ ఎత్తుకెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, కేవలం పోలీస్ పోస్టులనే ఎందుకు భర్తీ చేస్తున్నారో నిరుద్యోగులు ఆలోచించాలని మల్ల న్న ప్రశ్నించారు.

శారీరక దారుఢ్యం కలిగి, బలంగా ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు ఉద్యోగాలు లేక ఉద్యమాల్లోకి వస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుందనే భయంతోనే.. వారిని ‘సైలెన్స్’ చేయడానికి, చేతికి లాఠీ ఇచ్చి ఖాకీ బట్టలు వేయాలని ప్రభు త్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. నోటిఫికేషన్ లెక్కలను వివరిస్తూ.. 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం 3715 పోస్టులు రావాల్సి ఉండగా, కేవలం 27 శాతం రిజర్వేషన్ ఇచ్చి 2,008 పోస్టులకే పరిమితం చేశారని మల్లన్న ఆగ్ర హం వ్యక్తం చేశారు.

కేవలం ఐదు శాతం ఉన్న ఓసీ/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కట్టబెట్టి, వారికి దక్కాల్సిన 372 పోస్టుల కంటే రెట్టింపుగా 744 పోస్టులు కట్టబెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈడబ్ల్యూ ఎస్ వల్ల జనరల్ కేటగిరీలో రావాల్సిన పో స్టులు తగ్గిపోయి, మెరిట్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు తీరని అన్యా యం జరుగుతోందని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నిరుద్యోగుల నోటికాడ బుక్కను ఈడబ్ల్యూఎస్ పేరుతో దొంగతనం గా ఎత్తుకెళ్తున్న ఈ నోటిఫికేషన్ కుట్రను నిరుద్యోగ లోకం గమనించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాబోయే బీసీ ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేసి ఆ రిజర్వేషన్ పేరుతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని ఉద్యోగాల నుండి తొలగిం చి ఆ ఉద్యోగాలను అర్హులకు ఇస్తాం అని స్పష్టం చేశారు.

నేడు జనగామలో పర్యటన

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించనున్నా రు. ఈ పర్యటనలో భాగంగా జనగామలోనీ జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే బీసీ బ హుజన విద్యార్థి చైతన్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నా రు. అనంతరం టీఆర్పీలో చేరికల కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీలకు చెందిన నా యకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

అనంతరం జనగామ పట్టణం లోని పలు వార్డుల్లో టీఆర్పీ జెండాలను ఆవిష్కరించి, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల, మహిళా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.