నగరంలో నత్తనడకన ఐటీ పయనం
- మూడు రోజులుగా ఎడతెరిపిలేని వానలు
- స్తంభించిన ‘హైటెక్’ రోడ్లు
- నరకం చూస్తున్న ఉద్యోగులు
శేరిలింగంపల్లి, జూలై 30 (విజయక్రాంతి): రాజధాని నగరంలోని ఐటీ కారి డార్ వర్షం నీటిలో తడిసిముద్దవుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఐటీ రంగాన్ని, అక్కడ పనిచేసే ఉద్యోగుల దైనందిన జీవితాన్ని తీ వ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రధానంగా గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కొం డాపూర్, నాలెడ్జ్ సిటీ తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి.
వేల సంఖ్యలో వా హనాలు ఒకేసారి రోడ్లపైకి రావడం, నీరు సక్రమంగా పారే మార్గం లేకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి బయోడై వర్సిటీ జంక్షన్ వరకు, మాదాపూర్ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి సైబర్ టవర్స్ వరకు వాహనాలు అంగుళం కూడా కదల్లేని పరిస్థితి నెలకొంది. సిగ్నళ్లు సరిగా పనిచేయ కపోవడం, వర్షం కారణంగా వాహనాల వేగం తగ్గడం ఈ సమస్యను మరింత జటిలం చేస్తోంది. వర్షాలు, ట్రాఫిక్ నేపథ్యంలో క్యాబ్లు, ఆటోల ఛార్జీలు ఆకాశా న్నంటాయి. ఊ బర్, ఓలా వంటి యాప్‌లలో సర్జ్ ప్రైసింగ్ పేరిట రెండింతలు, మూ డింతలు ఛార్జీలు బాదుతున్నారు.






