01-10-2025 01:44:34 AM
ఏర్పాట్లలో అధికారగణంనిమగ్నం
కరీంనగర్, సెప్టెంబరు 30 (విజయ క్రాంతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షె డ్యూల్ విడుదలైంది. రెండు విడుతల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు కూడా రెండు వి డతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టో బర్ 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 12 పరిశీలన, అక్టోబర్ 15 నా మినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 23 ఎన్నికల నిర్వహిస్తారు.
నవంబర్ 11 న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తారు. అలాగే రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలనామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 13 నుంచి 15 వరకు, అక్టోబర్ 16 న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 19న నామినేషన్ల ఉపసంహరణ కు అ వకాశం కల్పించారు. అక్టోబర్ 27 న ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 11న ఓట్ల లెక్కిం పు అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు.
- గ్రామ పంచాయతీ ఎన్నికలు...
మొదటి విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 24 న నామినేషన్ లో పరిశీలన, 27ననామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించా రు. మొదటి విడత ఎన్నికలు నవంబర్ 4న నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కించి ఫలితాలను విడుదల చేస్తారు. అలాగే గ్రామ పం చాయతీ రెండవ విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 25 నుంచి 27 వరకు, 28న నామినేషన్ల పరిశీలన, 31ననామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.
నవంబర్ 8 న రెండో విడత ఎన్నికల నిర్వహించి అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.- ఎన్నికల నిర్వహ ణపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశంస్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూ లు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు, రెండు విడతల్లో గ్రామ పంచాయతీలకు( సర్పంచ్, వార్డు సభ్యులు)ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు.
మొత్తం నాలుగు విడతల్లో జిల్లాలో ఎన్నికలు ముగుస్తాయని అన్నారు. మొదటి విడతలో హుజురాబాద్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని (6మండలాలు) ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్, శంకర పట్నం, వీణవంక, వి సైదాపూర్ మండలాల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జరుగు తాయని తెలిపారు. రెండవ విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని (9 మండ లాలు) చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
మూడవ విడతలో కరీంనగర్ డివిజన్ పరిధిలోని మానకొండూర్ మండలం మినహా అన్ని మండలాలల పరిధిలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నాలుగో విడతలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలు సహా మానకొండూర్ మండల పరిధిలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉంటాయని అన్నారు.
సర్పంచ్ వార్డు, సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించిన అదే రోజు ఫలితాలు వెలుపడతాయని అన్నారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలకు ప్రతి మూడు, నాలుగు మండలాలకు ఒక ఆర్‌ఓ ను నియమిస్తున్నామని, మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు.
ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల, అంబేద్కర్ స్టేడియం, ప్రభుత్వ పాలిటె క్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, ధరావత్తు వివరాలు, ఎన్నికల వ్యయం, నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే వివరించారు.
అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, బిజెపి ప్రతినిధులు నాంపల్లి శ్రీనివాస్, బాస సత్యనారాయణ, వాసాల రమేష్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సిరాజ్ హుస్సేన్, మడుపు మోహన్, బిఆర్‌ఎస్ ప్రతినిధి సాతినేని శ్రీనివాస్, సిపిఐ(ఎం) ప్రతినిధి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ ప్రతినిధి కే.మణికంఠ రెడ్డి, ఏఐఎంఐఎం ప్రతినిధి సయ్యద్ బర్కత్ అలీ, టిడిపి ప్రతినిధి కళ్యాడపు ఆగయ్య, బి.ఎస్.పి ప్రతినిధి సిరిసిల్ల అంజయ్యపాల్గొన్నారు.