01-10-2025 01:48:46 AM
మేడ్చల్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు మీద ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. భారీ వాహనాలు, కార్లు ఈ రోడ్డుమీద అత్యంత వేగంగా వెళుతుంటాయి. టోల్ గేట్ సిబ్బంది వారిస్తున్నప్పటికీ ఒక వ్యక్తి బైకు మీద రాంగ్ రూటులో వెళ్లి మృత్యువాత పడ్డాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లపల్లి కి చెందిన కృష్ణ (52) దుండిగల్ వద్ద రాంగ్ రూటులో ద్విచక్ర వాహనంపై ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కాడు.
టోల్ గేట్ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి వేగంగా రాంగ్ రూటులో మేడ్చల్ వైపు వెళ్లాడు. మేడ్చల్ షామీర్పేట వైపు వెళుతుండగా ఒక కారును ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.