23 July, 2026 | 1:36 AM

సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వివాదం

23-07-2026 01:06 AM

కలెక్టర్‌తో కాంగ్రెస్ నేతల చర్చలు

 షాద్ నగర్, జులై 22(విజయక్రాంతి): సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును తీవ్రంగా నిరసిస్తూ షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో జేఏసీ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి  బుధవారం వినతిపత్రం అందజేసి ప్రాంత సమస్యను విన్నవించారు.డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు కలుషితమవుతాయని, వాయు-శబ్ద కాలుష్యంతో పాటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని కలెక్టర్కు వివరించారు.

దీనికి సానుకూలంగా కలెక్టర్ స్పందించి హామీ ఇచ్చారు.ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, డంపింగ్ యార్డ్కు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ సూచనప్రాయంగా వెల్లడించారు. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని, అవసరమైతే ప్రజల పక్షాన పెద్ద ఎత్తునఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.