20 May, 2026 | 6:13 AM

మరో ప్రయాగ్‌రాజ్ కాళేశ్వరం

20-05-2026 12:05 AM

రేపటినుంచి సరస్వతి అంత్య పుష్కరాలు 

మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి 

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

కరీంనగర్ /మంథని, మే19 (విజయక్రాంతి): తెలంగాణలో జయశంకర్ భూపాల పల్లి జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లా పరిధి లోని కాళేశ్వరంలోప్రతిష్టాత్మకంగా సరస్వతీ నది అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివే ణీ సంగమమైన ఈ పుణ్యక్షేత్రంలో, అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నది విశేషం ఏమిటంటే ఇక్కడ మూడు పుష్కరాలు జరగడం. ప్రస్తుతం సరస్వతి పుష్కరాలు జరగనుండగా వచ్చే ఏడు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.

మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న సరస్వ తి అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణి సం గమం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అలంకరణలతో ప్రాంతం కొత్త రూ పు దాల్చి, ప్రయాగరాజును తలపిస్తోంది. గత ఏడాది ప్రారంభ పుష్కరాలు జరిగిన త ర్వాత, ఇప్పుడు అంత్య పుష్కరాల కోసం అధికారులు అద్భుతమైన సెట్టింగ్స్తో ఏర్పా ట్లు పూర్తి చేస్తున్నారు.. మే నెల 21 నుంచి జూన్ 01 వరకు 12 రోజుల పాటు జరుగను న్న అంత్య పుష్కరాలకు అదిరిపోయేలా ఏ ర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్ర ఐ టి , పరిశ్రమల శాఖ మంత్రి. ఈ ప్రాంత ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు ప్రత్యేక ద్రుష్టి సారించి అధికారులకు. దిశ నిర్దేశనం చేశారు.జ్ఞాన సరస్వతి పు ష్కర ఘాట్, వి ఐ పి ఘాట్ వద్ద ప్రత్యేక సె ట్టింగ్స్ చేశారు. సౌండ్స్ అండ్ లైటింగ్, ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సి టీ నిర్మించారు. అంత్య పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజర య్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండడంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు.. నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు..

అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామిజీలు, పీఠాదిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలు ఉంటాయి. మొదటిరోజు 21వ తేదీ గురువారం రోజున మహా గణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం, 23వ తేదీన హయగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25వ తేదీన మహా మృత్యుజయ హోమం, 26వ తేదీన దుర్గా సూక్త హోమం, 27వ తేదీన మహా సుదర్శన హోమం, 28 వేద దక్షిణామూర్తి హోమం, 29వ తేదీన స్వయంవర పార్వతి హోమం, 30వ తేదీన ధన్వం తరి హోమం, 31వ మహారుద్ర హోమం, 01వ తేదీన లఘు చండీ మహా పూర్ణాహుతి ఉంటుంది.మంత్రి శ్రీదర్ బాబు సూచనల మేరకువచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శాశ్వత నిర్మాణాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.